అమలులోకి వచ్చిన ‘బిస్‌ చట్టం

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ (బిఐఎస్‌)చట్టం ఈనెల 12 నుండి అమలులోకి వచ్చింది.బంగారు ఆభరణాల వంటి విలువైన ఆభరణాలు మరిన్ని సేవలు తప్పనిసరిగా ఈ చట్టం పరిధిలోకి తీసుకువచ్చేందుకు దీంతో వీలుకలుగుతుంది. 1986 నాటి పాత బిఐఎస్‌ చట్టం స్థానంలో ఈ కొత్త చట్టాన్ని 2016 మార్చిలో పార్లమెంటు ఆమోదించింది.ఈ కొత్త చట్టానికి సంబంధించిన నిబంధనలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ వారంలో ఖరారు చేసింది.ఈ కొత్త చట్టం దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి మరింత దోహదపడుతుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలమంత్రి రామ్‌విలాస్‌ పాస్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ చట్టంలోని నిబంధనలు మేక్‌ ఇన్‌ ఇండియా ఉద్యమానికి ఊతం ఇవ్వడమే కాకుండా వినియోగదారులుకు నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు లభ్యమయ్యేలా చూస్తుందని మంత్రి తెలిపారు.ఈ కొత్తచట్టం కింద ప్రభుత్వం ప్రయోజనాలకు అవసరమని భావించే లేదా మనుషులు, జంతువులు, భూగోళం ఆరోగ్యానికి,పర్యావరణ భద్రతకు అవసరమని భావించే, లేదా అనుచిత వ్యాపార దోరణులను నివారించడానికి, జాతీయ భద్రతకుఅవసరమని భావించే ఏ వస్తువునైనా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావచ్చు. దీని ఫలితంగా బంగారం, ప్లాటినం లాంటివిలువైన లోహాలతో తయారుచేసే ఆభరణాలకు తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ చేయడానికి వీలు కలుగుతుందని ఆ ప్రకటనలోమంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *