అమ్మాయిలకు ఎదురుకట్నం ఇచ్చే రోజులొస్తున్నాయ్ : సీఎం చంద్రబాబు

విజయవాడ ముచ్చట్లు:

అమ్మాయిలకు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లిచేసుకునే రోజులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతున్న అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలకు విలువలు నేర్పించాలన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వేదికపై పలువురు అవార్డు గ్రహీతలతో మాట్లాడారు. పొదిలి నుంచి వచ్చిన విద్యార్థిని షర్మిల తన ప్రసంగంతో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకట్టుకుంది. ఐఏఎస్‌ చదివి చంద్రబాబు వద్దే పని చేయాలన్న తన కోరికను షర్మిల వెల్లడించింది.దీంతో స్పందించిన చంద్రబాబు షర్మిల చదువుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *