అరకు లోయలో బొలేరో బోల్తా-12 మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం

విజయనగరం ముచ్చట్లు :

అరకు పర్యటనకు వెళ్లి వస్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతగిరి నాలుగో టన్నల్‌ సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరపల్లి గ్రామానికి చెందిన వారు బొలేరో వాహనంలో అరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వాహనంలో ఉన్న 12 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం క్షతగాత్రులు శృంగవరపుకోట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *