అర్హులకు పెన్షన్లు ఎక్కడ – కౌన్సిలర్‌ ఇబ్రహిం

పుంగనూరు ముచ్చట్లు

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలోని అర్హులైన పేదలందరికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయాలని వైఎస్సాఆర్సీపి 24వ వార్డు కౌన్సిలర్‌ ఇబ్రహిం డిమాండు చేశారు. ఆయన తన వార్డులో పెన్షన్ల కార్యక్రమాన్ని ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అర్హులకు పెన్షన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. పెన్షన్ల మంజూరులో జన్మభూమి కమిటి సభ్యుల తీర్మాణాల మేరకు పెన్షన్లు మంజూరు చేయడంతో ప్రభుత్వ పథకాలు పార్టీ పథకాలుగా మార్చేస్తున్నారని ఆరోపించారు. పేదలందరికి పెన్షన్లు పంపిణీ చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మున్సిపాలిటి పరిధిలో ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత వైఎస్సాఆర్సీపి పాలకవర్గానికి లభించిందన్నారు. పేదల అభివృద్ధి వైఎస్సాఆర్సీపితోనే సాధ్యమని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *