అర్హులైన పేదలందరికి పెన్షన్లు పంపిణీ చేయాలి – అమరేంద్ర, అమ్ము డిమాండు

పుంగనూరు ముచ్చట్లు

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలోని అర్హులైన పేదలందరికి పెన్షన్లు పంపిణీ చే యాలని వైఎస్సాఆర్సీపి నాయకులు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్‌ అమ్ము డిమాండు చేశారు. పట్టణంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని పంపిణీ చే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన వారికి పెన్షన్లు పంపిణీ చేయడం లేదన్నారు. మున్సిపాలిటి పరిధిలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంతో మంది పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సాఆర్సీపి యువజన సంఘనాయకుడు జెపి.యాదవ్‌ , మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *