అవకాశం కలసివస్తే ఆర్‌వి.బోస్‌కు నామద్దతు – ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పుంగనూరు ముచ్చట్లు

అవకాశాలన్ని కలసివచ్చి నేను అనుకున్న నాదారిలో ఆర్‌వి.బోస్‌ వస్తే నా సంపూర్ణ మద్దతు ఉంటుందని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆర్యవైశ్య సంఘ వనభోజన కార్యక్రమానికి పలమనేరు దేశం నాయకుడు ఆర్‌వి.బోస్‌ పుంగనూరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు చిరునవ్వులతో , అప్యాయంగా ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పలమనేరులో తాము గెలిపించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి మంత్రి అయ్యారని , బోస్‌ అన్ని విధాల నష్టపోయారని విచారం వ్యక్తం చేశారు. అదృష్టం కలసివస్తే ఆర్‌వి.బోస్‌కు తాను పలమనేరులో అన్నివిధాల మద్దతు ఇస్తానని తెలిపారు. ఈ మాటలతో సభలో హర్ష ధ్వానాలు మిన్నంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *