అవినీతిపై కొరడ ఝులిపించిన ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ బాలసుబ్రమణ్యం – ప్రొద్దుటూరు ఆర్టీవో ర వూఫ్ పై సస్పెన్షన్వేటు – ఏసిబి దాడుల ఫలితమే

ప్రొద్దుటూరు ముచ్చట్లు

రవాణాశాఖలో అవినీతిని అంతవెహోందించేందుకు ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్‌ బాలసుబ్రమణ్యం అహర్నిశలు శ్రమిస్తున్నారు. కానీ సమూలంగా అవినీతిని అంతం చేయాలనే లక్ష్యంతో ప్రొద్దుటూరు ఆర్టీవో డిఎస్‌.అబ్దుల్‌ ర వూఫ్  ను సస్పెండ్‌ చేస్తూ రవాణాశాఖ అధికారులకు మచ్చెమటలు పట్టించి, హెచ్చరికలు జారీ చేశారు. ప్రొద్దుటూరు ఆర్టీవో కార్యాలయంలో ఈనెల 11న ఏసిబి అధికారులు ఆకస్మికదాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజెంట్లతో పాటు కార్యాలయంలోని వివిధ ప్రాంతాలలో అనధికారికంగా ఉన్న రూ.1.01,150 లక్షలను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఏసిబి అధికారులు ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్‌కు నివేదికలు పంపారు. వీటిపై విచారణ జరిపిన ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్‌ బాలసుబ్రమణ్యం ఆర్టీవోను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటనతో రవాణాశాఖ ఉలిక్కిపడింది. కాగా ఈ సంఘటనతోనైనా ఆర్టీవో అధికారులు జాగ్రత్తలు వహిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *