‘అసెంబ్లీలో తెదేపాతో కలిసి పనిచేస్తాం’

 రేపట్నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తెదేపా, భాజపా కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు భాజపా శాసనసభా పక్ష నేత కిషన్‌రెడ్డి తెలిపారు.హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో రెండు పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. దీనికి తెదేపా నుంచి ఎల్‌.రమణ, ఆర్‌.కృష్ణయ్య, సండ్ర వెంకట వీరయ్య, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, ఉమా మాధవరెడ్డి హాజరయ్యారు. భాజపా నుంచి కిషన్‌రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, రాజాసింగ్‌, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. సభలో ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై రెండు పార్టీల నేతలు సమాలోచనలు చేసినట్లు సమాచారం.

సమావేశం అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. 50రోజుల పాటు జరిగే సమావేశాల్లో తెదేపా, భాజపా కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.ప్రజా సమస్యలే అజెండాగా అసెంబ్లీలో తమ పాత్ర ఉంటుందని చెప్పారు. రైతుల సమస్యలు, నేరెళ్ల ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అసెంబ్లీలో చర్చించాల్సిన 25 అంశాలను తెదేపా గుర్తించిందన్నారు. తెదేపా శాసనసభాపక్ష నేత ఎవరనేది ఇంకా నిర్ణయించలేదని పార్టీ అధ్యక్షుదు ఎల్‌.రమణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *