అసెంబ్లీలో బోర్ కొడుతోంది

హైదరాబాద్ ముచ్చట్లు

ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో సభలో వాడి వేడి చర్చ కనబడటం లేదు. ప్రతిపక్షం లేకపోవడంతో అధికార పార్టీ సభ్యులు బోర్ గా ఫీలవుతున్నట్టు సమాచారమ్. ఈ విషయాన్ని భాజాపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అంగీకరించారు. ప్రతిపక్షం లేని సభ బోర్ కొడుతోంది. తమ పార్టీ అనుమతిస్తే సభలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని అంటున్నారు.విష్ణుకుమార్ ఒక్కరే కాదు. సభ్యులంతా బోర్ గా ఫీలవుతున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. సభలో ప్రతిపక్షం ఉంటే ఏ రేంజ్ లో హడావుడి ఉండేది. ముఖ్యంగా సభలో చంద్రబాబు వర్సెస్ జగన్ ఏపీసోడ్ భలే ఉండేది. ఇప్పుడు సభలో ప్రతిపక్షం లేకపోవడంతో సభలో ఉన్న సభ్యులు, టీవీల్లో అసెంబ్లీ సమావేశాలని వీక్షించే ప్రజలు బోర్ గా ఫీలవుతున్నారు.మరోవైపు, అసెంబ్లీ సమావేశాలని బహిష్కరించిన ప్రతిపక్ష నాయకుడు వైఎస్. జగన్ పాదయాత్రతో బిజీగా ఉన్నారు. ఇప్పటి నుంచి ఎన్నికల హామీలని ఇస్తూ వెళ్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *