అసెంబ్లీ సీట్ల పెంపుపై రాజ్‌నాథ్ తో చర్చించిన చంద్రబాబు!

ఢిల్లీ ముచ్చట్లు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతుంది. వరుసగా కేంద్రమంత్రులతో సమావేశం అయిన ఆయన
ముఖ్యంగా విభజన చట్టంలోని హామీలు, అసెంబ్లీ సీట్లపెంపు, పోలవరంకు రావాల్సిన నిధులపై కేంద్రమంత్రుల భేటీలో చర్చించారు. మొదట కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో చంద్రబాబు భేటీ అయి పోలవరం నిధులపై చర్చించారు. ఇప్పటికి వరకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు త్వరగా విడుదల చేయాలని కోరారు. అనంతరం కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..అసెంబ్లీ సీట్ల పెంపుపై రాజ్‌నాథ్‌తో చర్చించామని, అమిత్‌షాతో ఫోన్‌లో మాట్లాడామని, సీట్ల పెంపుపై కసరత్తు చేస్తున్నామని, త్వరలో దీనిపై ఓ క్లారిటీ రానుందని అమిత్ షా బదులిచ్చినట్లు తెలిపారు.మొత్తానికి ఈ సీట్లపెంపుపై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కేంద్రమంత్రులను కోరామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *