ఆటో, ద్విచక్ర వాహనం ఢీ:ఇద్దరు మృతి

తిరుమలగిరి ముచ్చట్లు:

జిల్లాలోని తిరుమలగిరి మండలం తొండ గ్రామ సమీపంలో గురువారం రాత్రి ఆటో, ద్విచక్ర వాహనం ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండ గ్రామం నుంచి తిరుమలగిరి వెళ్తున్న ఆటో తిరుమలగిరి నుంచి తొర్రూర్‌ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆటో డ్రైవర్‌, ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోడ్రైవర్‌ తొండ గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకు న్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *