ఆదిలాబాద్‌లో 12 డిగ్రీలు!

హైదరాబాద్‌/విశాఖపట్నం, రాష్ట్రంలో చలి వాతావరణం కొనసాగుతోంది. అంతటా సాధారణం కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌లో 12 డిగ్రీలు, మెదక్‌లో 14 డిగ్రీలు, హైదరాబాద్‌, ఖమ్మంలలో 16, భద్రాచలం, హకీంపేటల్లో 17, హన్మకొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, రామగుండంలో 18 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీంతో తమిళనాడు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *