ఆర్యవైశ్యులకు రాజకీయ పదవులు సేవ చేయడానికి – ఆర్‌వి.బోస్‌

 

పుంగనూరు ముచ్చట్లు

ఆర్యవైశ్యులకు రాజకీయ పదవులు వ్యాపారాలకు కాదని, ప్రజలకు సేవ చేసేందుకు అవసరమని పలమనేరు ఆర్యవైశ్య సంఘం, తెలుగుదేశం నాయకుడైన ఆర్‌వి.బోస్‌ తెలిపారు. కార్తీక వనభోజన కార్యక్రమాన్ని పుంగనూరు ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ముల్లంగి విజయ్‌కుమార్‌, పిఎల్‌.శ్రీధర్‌ ఆధ్వర్యంలో గూడూరుపల్లె శ్రీలక్ష్మినరసింహాస్వామి ఆలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఆర్‌వి.బోస్‌ను ఆర్యవైశ్య సంఘ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బోస్‌ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఐకమత్యంతో అన్ని రంగాల్లోను రాణించాలన్నారు. ఆర్యవైశ్యులను రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ జిల్లా నేతలు మువ్వలనరసింహులుశెట్టి, ఒంటిమిట్ట సత్యనారాయణగుప్తా, బైరెడ్డిపల్లె వైఎస్సాఆర్సీపి నాయకుడు క్రిష్ణమూర్తి, పలమనేరు వైఎస్సాఆర్సీపి నాయకులు ఆకుల గజేంద్రరాయల్‌, తిరుపతి వైఎస్సాఆర్సీపి నాయకులు పోకలఅశోక్‌కుమార్‌, స్థానిక ఆర్యవైశ్య సంఘ నేతలు ప్రవీన్‌, సుకుమార్‌,కె.బాలసుబ్రమణ్యం, ఆర్‌వి.బాలాజి, గురుమూర్తిశెట్టి, మునిరాజశెట్టి, శ్రీనాథ్‌శెట్టి, రాము, రాజేందప్రసాద్‌, ముల్లంగి ఆనందమోహన్‌, సుంకు ప్రవీన్‌కుమార్‌, లక్ష్మినరసింహం, సత్యనారాయణగుప్తా, లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *