ఇంకెప్పుడు కాపలా?

2014 జూలై 24.. పూర్వపు మెదక్‌ జిల్లా మాసాయిపేట శివార్లలోని కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌ వద్ద పాఠశాల బస్సు పట్టాలు దాటుతోంది.. సికింద్రాబాద్‌–నాందెడ్‌ ప్యాసింజర్‌ రైలు వేగంగా దూసుకొచ్చి బస్సును ఢీకొట్టింది.. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 19 మంది ప్రాణాలు బలైపోయాయి.. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘కాపలా లేని లెవల్‌ క్రాసింగ్స్‌ ఇప్పటికీ ఉండటం దురదృష్టం.

వీలైనంత త్వరగా కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌లను తొలగిస్తాం..’.. అని మాసాయిపేట ప్రమాదంపై అప్పటి రైల్వే మంత్రి ప్రకటించారు. చూస్తుండగానే మూడేళ్లు గడిచిపోయాయి. కానీ రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కాపలా లేని లెవల్‌ క్రాసింగ్‌లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఇంకా 246 చోట్ల కాపలా లేని లెవల్‌ క్రాసింగులు ఉన్నాయి. అసలు లెవల్‌ క్రాసింగ్స్‌ సమస్యను పరిష్కరిస్తామని ఘనంగా ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. దీనికి పెట్టుకున్న గడువును ఇప్పటికే రెండు సార్లు పొడిగించుకుంది. తాజాగా మరో ఏడాది పెంచుకుంది.

దేశవ్యాప్తంగా జరుగుతున్న రైలు ప్రమాదాల్లో కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద జరుగుతున్నవి – 40%
రైలు ప్రమాద మరణాల్లో కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద జరుగుతున్నవి – 68%
కాపలాలేని గేట్ల తొలగింపు ఇలా.. 2014 వరకు – 581
2017 సెప్టెంబర్‌ నాటికి – 355
ఇంకా తొలగించాల్సినవి – 246

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *