ఇండియాలో వందకు పెరిగిన స్పీడ్

Date:17/04/2018

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

జాతీయ రహదారుల నాణ్యత గతంలో కంటే మెరుగుపడటంతో భారతీయ రోడ్ల మీద వాహనాల వేగపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగ త కార్ల వేగాన్ని గంటకు 100 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లకు పెంచింది. అలాగే టాక్సీలు క్యాబ్‌ల వేగ పరిమితిని ఇంతకుముందున్న 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు పెంచింది. జాతీయ రహదారుల మీద కూడా వ్యక్తిగత కార్లు, ఇతర వాహనాలకు గంటకు 100 కిలోమీటర్లు, టాక్సీలు, క్యాబ్‌లకు గంటకు 90 కిలోమీటర్ల వేగ పరిమితిని నిర్ధారించింది. వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాైలెతే జాతీయ రహదారుల మీద గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించచ్చు. నగరాల్లో రోడ్ల మీద వ్యక్తిగత కార్లు అయినా… క్యాబ్‌లు అయినా కూడా గంటకు గరిష్ఠంగా 70 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లకూడదు. ద్విచక్ర వాహనాలకు గతంలో 40 కిలోమీటర్ల వేగ పరిమితి ఉండగా, ఇప్పుడది గంటకు 60 కిలోమీటర్లయింది. అయితే.. ఇవన్నీ కేవలం కొన్ని ఎక్స్‌ప్రెస్ వేలు, జాతీయ రహదారులకు మాత్రమే పరిమితం. ఎక్కడికక్కడ రోడ్ల పరిస్థితులు, మలుపులు, సమీపంలో గ్రామాలు తదితర అంశాల ఆధారంగా వేర్వేరు వేగ పరిమితులను నిర్ణయిస్తారు. వాటిని వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

Tags:Speed of Speed in India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *