ఇకపై తాజ్‌మహల్‌ చుట్టూ నో పార్కింగ్‌తొలగించాలంటూ ఆదేశించిన సుప్రీంకోర్టు 

దిల్లీ ముచ్చట్లు:

ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ చుట్టూ ఇకపై వాహనాలు నిలపడం కుదరదు. తాజ్‌ చుట్టూ ఉన్న పార్కింగ్‌ ప్రాంతాన్ని వెంటనే తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్కింగ్‌ కారణంగా పర్యావరణ కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చారిత్రక కట్టడాన్ని సంరక్షించేందుకే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపింది.కాగా.. గత ఆగస్టులోనూ తాజ్‌మహల్‌ విషయంలో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.తాజ్‌ను నాశనం చేయాలనుకుంటున్నారా? అని గట్టిగా ప్రశ్నించింది. మధుర-దిల్లీ మధ్య అదనపు రైల్వే ట్రాక్‌ కోసం 400 చెట్లను నరికేందుకు ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. ఈ అప్లికేషన్‌ను విచారిస్తున్న సమయంలో యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చురకలంటించింది. ‘తాజ్‌ ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడం. మీరు దాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? తాజ్‌మహల్‌ ఇటీవలి చిత్రాలను ఎప్పుడైనా చూశారా? ఒకసారి ఇంటర్నెట్లో చూడండి’ అని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇదిలా ఉండగా.. తాజ్‌మహల్‌ ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. యూపీ పర్యాటక ప్రాంతాల జాబితాలో తాజ్‌ పేరు లేకపోవడం వివాదానికి తెరతీసింది. తాజ్‌మహల్‌పై పలువురు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *