ఇది టూకె రన్‌….కాదు దోమలకు పరుగులు తీస్తున్న జనం

చిత్తూరు ముచ్చట్లు
– జిల్లాలో జ్వరాల తీవ్రత -పట్టించుకోని అధికారులు
జిల్లా ప్రజలను దోమలు హడలెత్తిస్తోంది. దోమకాటుకు గురైన జనం ఆసుపత్రుల్లో కుప్పలుగా చేరిపోతున్నారు. దోమలు జనానికి కునుకులేకుండ చేస్తున్నాయి. రాత్రి, పగలు తేడాలేకుండ దోమలబెడదకు జనం పరుగులు తీస్తున్నారు. నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఎంతో మంది అమాయక జనం డెంగ్యూ, మలేరియా లాంటి విషజ్వరాల భారీన పడి చికిత్సల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *