ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్ ముచ్చట్లు :

జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో భద్రతా దళాలు ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను శనివారం ఉదయం మట్టుబెట్టాయి. ఓ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం నిర్దిష్ట సమాచారం మేరకు పుల్వామాలోని లిట్టర్ గ్రామానికి భద్రతా దళాలు శనివారం తెల్లవారుజామున వెళ్ళాయి. ఉగ్రవాదులు తమను సమీపిస్తున్న భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించాయి. అనంతరం భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా కమాండర్లు వసీం షా, హఫీజ్ నిసార్ హతమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *