ఝాంసి ముచ్చట్లు:
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఝాంసి జిల్లాలోని లాహర్చుడ ప్రాంతంలో సోమవారం చోటు చేసుకుంది.ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో.. దమన్సింగ్, నంద్ కిషోర్, లాల్రామ్, బ్రిజేష్ అనే నలుగురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా రూరల్ ఎస్పీ కుల్దీప్ సంఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.