ఉపాధ్యాయురాలిపై దాడి నగలు చోరి

పెద్ద పంజాణి ముచ్చట్లు

విదులు ముగించుకుని వెళుతున్న ఉపాధ్యాయురాలిపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు దాడి చేసి, నగలు దోచుకెల్లిన సంఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. బాదితురాలి కథనం మేరకు వివరాలు..గోనుమాకులపల్లె ప్రాథమిక పాఠశాలలో సుమారు రెండు సంవత్సరాలుగా ఎస్జీటి గా మంజుభార్గవి అనే ఉపాధ్యాయురాలు విదులు నిర్వహిస్తున్నారు. అదేవిదంగా సోమవారం విదులు ముగించుకుని పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనం(passion pro) పై వచ్చి ఆమెను గాయపరిచి మెడలోని బంగారు చైను,తాళి,చెవి కమ్మలు దోచుకెళ్ళారు. ఈ విషయం పై ఆమె మండల విద్యాదికారి హేమలత, స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై రాజ శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *