ఉప్పల్‌లో ప్రమాదం: ఎస్సై మృతి

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఉప్పల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్సై మృతిచెందారు. మునిపల్లి సురేష్‌ కుమార్‌(37) ఇబ్రహీంపట్నంలో 3వ బెటాలియన్‌లో రిజర్వు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. యూసఫ్‌గూడ నుంచి ఇబ్రహీంపట్నం వైపు ఆయన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఉప్పల్‌ లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ సిగ్నల్‌ పాయింట్‌లో వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ సంఘటనలో సురేష్‌బాబు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *