ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, రోజ చే షోరూమ్‌ ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు

పుంగనూరు పట్టణంలోని నాగపాళ్యెంలో తొలిసారిగా ఎంలార్జ్ గార్మెంట్‌ షోరూమ్‌ను వైఎస్సాఆర్‌సిపి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌కె.రోజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనినటి రోజను చూసేందుకు మహిళలు , యువకులు దూసుకొచ్చారు. రోజ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సెల్పీలు దిగారు. అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. షోరూమ్‌ అధినేతలు రవీంద్రనాథరెడ్డి, లోకనాథరెడ్డి ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సాఆరీసి నేతలు రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్‌, నాగరాజరెడ్డి, ఆర్‌విటి బాబు, ముస్లింమైనార్టీల నాయకులు అయూబ్‌ఖాన్‌, బిటి అతావుల్లా, కౌన్సిలర్లు అమ్ము, ఇబ్రహిం, ఆసిఫ్‌, మనోహర్‌, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *