ఎయిర్‌పోర్ట్‌లో ఐసిస్‌ ఉగ్రవాది అరెస్ట్‌?

ముంబయి ముచ్చట్లు:

ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారంఉగ్రవాద వ్యతిరేక దళ అధికారులు ఐసిస్‌ అనుమానితుడిని అరెస్ట్‌ చేశారు. అతన్ని అబు జైద్‌గా అధికారులు గుర్తించారు. ఇతను దుబాయ్‌లో ఉంటూనే పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యువకులతో ఐసిస్‌ నెటవర్క్‌ నడుపుతున్నట్లు వెల్లడించారు.గతంలో బిజనోర్‌, యూపీలో అరెస్టైన అనుమానితులతో కూడా టచ్‌లో ఉంటున్నట్లు ఏటీఎస్‌ అధికారులు తెలిపారు. ముంబయి చేరుకునే వరకు పోలీసులు అబుని ట్రాక్‌ చేస్తూ ఎట్టకేలకు ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టు చేశారు. గత వారం కేరళలోని కన్నూరుకి చెందిన ఐదుగురు అనుమానితుల్ని పోలీసులు పట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *