ఎర్ర జెండా ఊపాడు… రక్షకుడిగా మారాడు…

కోల్‌కతా ముచ్చట్లు :

హౌరా-న్యూఢిల్లీ మార్గంలో భారీ రైలు ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తి చూపిన వివేకం వల్ల వందలాది అమాయకుల ప్రాణాలు నిలిచాయి. బుర్ద్వాన్ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలను ఓ వార్తా సంస్థ తెలిపింది. అయితే దీనిపై పశ్చిమ రైల్వే అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు.ఆ వార్తా సంస్థ కథనం ప్రకారం హౌరా-న్యూఢిల్లీ మార్గంలో బుర్ద్వాన్ జిల్లాలో రైలు పట్టాలను దగ్గరకు చేర్చి, పట్టి ఉంచే ఫిష్ ప్లేట్ తొలగిపోయి ఉండటాన్ని స్థానికుడొకరు గమనించారు. అదే సమయంలో అటువైపు ఓ రైలు దూసుకొస్తుండటాన్ని చూశారు. వెంటనే అప్రమత్తమై తన వద్దనున్న ఎర్రని వస్త్రాన్ని ఊపుతూ, రైలు డ్రైవర్‌కు సంకేతాలు పంపించారు. రైలు డ్రైవర్ కూడా ఏదో ప్రమాదం పొంచి ఉందని గ్రహించి, అత్యవసరంగా బ్రేకులు వేసి, రైలును ఆపేశారు. దీంతో ఆ రైలు ఫిష్ ప్లేట్లు తొలగించబడి ఉన్న ప్రదేశానికి కాస్త దూరంలో ఆగింది. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలు డ్రైవర్‌ను, స్థానికుడిని ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *