ఎస్సీ, ఎస్టీ సమావేశాలకు అధికారులు హాజరుకాకపోతే ఏలా ..? – దళిత నేతల ఆవేదన

పుంగనూరు ముచ్చట్లు

ఎస్సీ, ఎస్టీ మానటరింగ్‌ కమిటి సమావేశాలకు అన్నిశాఖల అధికారులు హాజరుకాకపోతే ఎలాగంటు దళితనేతలు ప్రశ్నించారు. తహశీల్ధార్‌ మునిరాజు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ మానటరింగ్‌ కమిటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి నరసింహులు మాట్లాడుతూ సమావేశాలకు అధికారులు హాజరుకాకపోవడంతో ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. మానటరింగ్‌ కమిటి సమావేశాలకు అర్థం మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేకపోతే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ, సీఐ సాయినాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *