ఎస్‌ఆర్‌ నగర్‌లో యువతిపై కిరాతకం

హైదరాబాద్‌  ముచ్చట్లు:

అటు విశాఖలో యాచకురాలిపై యువకుడి కీచకపర్వం ఘటన దర్యాప్తు కొనసాగుతుండగానే, హైదరాబాద్‌లో మరో కిరాతకం చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రైతు బజార్‌ వద్ద ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు.రక్తపుమడుగులో పడిపోయిన యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రేమ పేరుతో కొద్ది రోజులుగా వెంటపడుతోన్న యువకుడే చివరికి ఆమె ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *