ఎస్‌డిపీఐ ఆధ్వర్యంలో ధర్నా

పుంగనూరు ముచ్చట్లు

పుంగనూరు పట్టణంలోని సోషియల్‌ డెమెక్రటిక్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , న్యాయవాది జహుర్‌బాషా, సీపీఐ ప్రధాన కార్యదర్శి వెంకట్రమణారెడ్డి, కార్యదర్శి అతిక్‌బాషా, కాంగ్రెస్‌ నాయకుడు సజ్జాద్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జహుర్‌బాషా మాట్లాడుతూ నోట్లు రద్దుకాబడి సంవత్సరం కావస్తున్నా నల్లదనం వివరాలను వివరించడం లేదని తెలిపారు. నోట్ల రద్దుతో పేదల కష్టాలు తప్పడం లేదన్నారు. బ్లాక్‌డేగా నిర్ణయించి, ధర్నాలు చేపట్టామన్నారు. ఈ మేరకు తహశీల్ధార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నేతలు జమీర్‌లాల్‌, ఫయాజ్‌, కరీం, మన్సూర్‌, ఇర్షాద్‌, అమ్జాద్‌, రహంతుల్లా, ఆసిఫ్‌, ఇమ్రాన్‌ , వెంకటేష్‌, బాబు, అల్లాభక్షు, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *