ఏయూ ఆచార్యుడిపై వేధింపుల ఆరోపణలు

విశాఖపట్నం ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయం సంస్కృత ఆచార్యుడు ఏడుకొండలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ విద్యార్థునులు నిరసనకు దిగారు. ఆయనపై గతంలోనూ లైంగిక ఆరోపణలున్నాయి. దీంతో రెండేళ్లుగా విధులకు దూరంగా ఉన్నారు. నెలరోజుల క్రితమే మళ్లీ విధుల్లో చేరిన ఆయనకు సంస్కృత విభాగం అధిపతిగా తిరిగి బాధ్యతలు అప్పగించారు. ఏడుకొండలు తమపై అన్యాపదేశంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు సోమవారం ఆందోళనకు దిగారరు. రెక్టార్‌ ఆచార్య గాయత్రీ దేవి కారును అడ్డగించి ఆయన్ని విధుల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు.అయితే తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఏడుకొండలు ఖండించారు.ఈరోజు నుంచి సంస్కృత విభాగంలో పరీక్షలు ప్రారంభమయ్యాయని, హాజరు శాతం తక్కువగా ఉన్న వారిని అనుమతించకపోవడం వల్లనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా యూనివర్శిటీ ఉన్నతాధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *