కన్న కూతురిపై అత్యాచారం

వరంగల్‌ ముచ్చట్లు:

కన్న కూతురిపై ఓ కసాయి తండ్రి రెండు నెలలుగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా చార్‌బౌళికి చెందిన విజయేంద్రచారి అనే రైల్వే ఉద్యోగి గత రెండు నెలలుగా తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో ఈ ఘాతుకం బయటపడింది. తల్లి, కుమార్తె, తనయుడు కలిసి తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును స్వీకరించిన ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *