కమల్‌పై కేసు నమోదు!

ఢిల్లీ ముచ్చట్లు

ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌పై శుక్రవారంనాడు వారణాసిలో కేసు నమోదైంది. హిందూ ఉగ్రవాద వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఈ కేసు నమోదైంది. దీనిపై విచారణను శనివారం చేపట్టనున్నారు. తమిళ వీక్లీ ‘ఆనంద వికటన్’లో కమల్ తన కాలమ్‌లో చేసిన వ్యాఖ్యలు గాను పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ‘గతంలో హిందూ సంఘాలు హింసకు పాల్పడేవి కావు. తమ వాదనలపై విపక్షాలతో వాదోపవాదాలు చేసేవి. అయితే ఈ పాత పద్ధతికి వారు తిలోదకాలు ఇచ్చారు. కండబలం చూపించడం మొదలుపెట్టారు. భౌతిక దాడులు చేసే స్థాయికి చేరుకున్నాయి. హింసకు పాల్పడుతున్నారు’ అని కమల్ తన కాలమ్‌లో వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *