కాంగ్రెస్‌తో కలిస్తే తప్పేంటి..?: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణలో పార్టీలు లేవు.. కేసీఆర్, కేసీఆర్ వ్యతిరేకులు మాత్రమే ఉన్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న రేవంత్.. పార్టీ మారడంపై, ఏపీ మంత్రులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడానికి సిద్ధంగా లేమన్నారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నామన్న ఆయన.. పొత్తు అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. సిద్ధాంతాలు చెప్పుకునే పార్టీలు వేర్వేరు పొత్తులు పెట్టుకుంటే తప్పులేదు కానీ.. టీడీపీ పొత్తులు పెట్టుకుంటే తప్పేముందన్నారు.ఇటీవల టీఆర్ఎస్‌తో తెలంగాణ టీడీపీ పొత్తు పెట్టుకోనుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో పొత్తుపై స్పందించి రేవంత్ రెడ్డి.. పొత్తులపై చంద్రబాబు స్పష్టతనివ్వాలన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన పూర్తిచేసుకొని వచ్చిన వెంటనే ఆయనను కలుస్తానని చెప్పారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా డిసెంబర్ 9 నుంచి పాదయాత్ర చేస్తానని రేవంత్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *