కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అస్వస్థత

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన సిమ్లా నుంచి ఢిల్లీకి చేరుకొని గంగా రామ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సోనియా గాంధీకి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తరుచుగా యూఎస్‌కు వెళ్లి సోనియా ట్రీట్‌మెంట్ తీసుకుంటుంటారు. ప్రస్తుతం 70 ఏండ్ల వయసు ఉన్న సోనియా గాంధీని అబ్జర్వేషన్‌లో పెట్టినట్లు వైద్యులు తెలిపారు. అయితే.. ఇప్పటి వరకు తనకు ఉన్న అనారోగ్యం ఏంటన్న విషయం తెలియకుండా పార్టీ జాగ్రత్త పడుతున్నది. త్వరలోనే తన కొడుకు, కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించనున్నట్లు సోనియా మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *