కాంగ్రెస్ ఫ్లెక్సీలో రేవంత్.. వరంగల్లో కలకలం!

వరంగల్ ముచ్చట్లు:

తెలంగాణలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలకు బలం చేకూరేలా వరంగల్లో ఓ ఫ్లెక్సీ వెలిసింది. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ స్థానిక కాంగ్రెస్ నేతలు కృష్ణారెడ్డి, ఓర్సురాజు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. వరంగల్ నగరంలో హన్మకొండ-హైదరాబాద్ ప్రధాన రహదారిపై కాజీపేట వద్ద ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో వరంగల్ డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో పాటు రేవంత్ ఫొటో ప్రధానంగా కనిపిస్తుండడం వరంగల్లో కలకలం సృష్టిస్తోంది. రేవంత్ చేరికను కాంగ్రెస్లోని పలువురు నేతలు ఆహ్వానిస్తున్నట్లు ఈ ఫ్లెక్సీ ద్వారా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *