కాపు సంఘ నేత గజేంద్రరాయల్‌ను కలసిన ముస్లింలు

పలమనేరు ముచ్చట్లు

వైఎస్సాఆర్సీపి నాయకుడు కాపు సంఘ జిల్లా కార్యదర్శి అయిన ఆకుల గజేంద్రరాయల్‌ను ముస్లింలు కలిశారు. పలమనేరులో ఈ మేరకు ముస్లింలు కలసి ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా గజేంద్ర మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు అండగా నిలవాలన్నారు. వైఎస్సాఆర్సీపి అధికారాన్ని పొందేందుకు ప్రతి ఒక్కరు సైనికుల వలె పని చేయాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *