కారు బోల్తా ముగ్గరికి గాయాలు

నెల్లూరు ముచ్చట్లు

కారుబోల్తా పడ్డ సంఘటనలో ముగ్గురు పోలీసులకు, ఓ ఖైదీకి గాయాలయ్యాయి.పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గ్రామం వద్ద ఆదివారం ఉదయం ఓ కారు బోల్తా కొట్టింది.రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఓ ఖైదీని ముగ్గురు పోలీసుల ఎస్కార్టుతో కారులో గుంటూరుకు వెళుతుండగా సత్యనారాయణపురం వద్ద బోల్తా కొట్టింది.దీంతో పోలీసులకు, ఖైదీకి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఆదివారం వర్షం కురుస్తోంది.గూడూరు, వెంకటగిరి, సైదాపురం, వాకాడు మండలాల్లో వర్షం కురుస్తోంది.రెండు రోజుల నుంచి ఈ ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు సంభవించి వర్షాలు కురుస్తున్నాయి.అంతేగాక నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతాలకు తమిళనాడు రాష్ట్రం అతి సమీపంలో ఉంది.ప్రస్తుతం చెన్నై నగరంలో గత ఐదు రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తోంది.ఆ ప్రభావం కాస్త పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పడి వర్షాలు కురుస్తున్నాయని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *