కార్తీక పౌర్ణమి వేడుకలో తొక్కిసలాట: ముగ్గురు మృతి

పాట్న ముచ్చట్లు:

కార్తీక పౌర్ణమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటన బిహార్‌లోని బెగుసరాయ్‌లో సిమారియా ఘాట్ వద్ద చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో పది మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డట్టు తెలిసింది. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.రెండు మృతదేహాలను నదిలోకి విసిరినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *