కాసేపట్లో భన్వర్‌లాల్ పదవి విరమణ

హైదరాబాద్ ముచ్చట్లు:

కాసేపట్లో ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్ లాల్ పదవి విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో తెలంగాణ ఎన్నికల సంఘం ఇంచార్జీ అనూప్ సింగ్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
1957 అక్టోబర్ 25న భన్వర్‌లాల్ జన్మించాడు. 1983 ఐఏఎస్ బ్యాచ్‌‌కు చెందిన భన్వర్‌లాల్ ఆంధ్రప్రదేశ్‌ క్యాడెర్‌ అధికారి. ఆయన రాజస్థాన్ యూనివర్శిటిలో ఎకనమిక్స్‌‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ఈయన మొదట సబ్ కలెక్టర్‌‌గా కందుకూరు, కరీంగనర్‌‌గా జిల్లాలో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌‌లో సెంట్రల్ సిల్క్ బోర్డు మరియు సివిల్ సామాగ్రి కమిషనర్‌‌గా కూడా పనిచేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఎన్నికల సంఘం ప్రధాన అధికారి పనిచేసిన ఘనత భన్వర్‌లాల్‌కే చెందుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *