కివీస్‌ కిలకిల: కోహ్లీసేనకు ఓటమి

న్యూజిలాండ్‌ నిలిచింది. వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టామ్‌ లేథమ్‌ (103 నాటౌట్‌; 102 బంతుల్లో 8×4, 2×6) శతకంతో కదం తొక్కాడు. రాస్‌ టేలర్‌ (95; 100 బంతుల్లో 8×4) భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 281 పరుగుల లక్ష్యాన్ని పర్యాటక జట్టు సునాయాసంగా ఛేదించింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 190 బంతుల్లో 200 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆచితూచి ఆడుతూ సింగిల్స్‌ తీశారు. రన్‌రేట్‌, ఒత్తిడి పెరగకుండా అద్భుతంగా ఆడారు. దీంతో 6 బంతులు మిగిలుండగానే కివీస్‌ విజయం సాధించింది.

ఒకే ఒక్కడు కోహ్లీ
వాంఖడేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ట్రెంట్‌ బౌల్ట్‌ (4/35) దెబ్బకు శిఖర్‌ ధావన్‌ (9) జట్టు స్కోరు 16 వద్ద వెనుదిరిగాడు. అతడి బౌలింగ్‌లోనే 5.4వ బంతికి భారీ షాట్‌ ఆడబోయిన రోహిత్‌ శర్మ (20; 18 బంతుల్లో 2×6) బౌల్డ్‌ అయ్యాడు. ఈ క్రమంలో పదునైన బంతులతో విరుచుకు పడుతున్న కివీస్‌ బౌలర్లను సారథి విరాట్‌ కోహ్లీ (121; 125 బంతుల్లో 9×4, 2×6) కాచుకున్నాడు. తొలుత ఆచితూచి ఆడాడు. వూరించే బంతులు వేసినా తొందరపడలేదు. కేదార్‌ జాదవ్‌ (12; 25 బంతుల్లో 1×4)ఔటైనా బెదరలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *