కేరళలో బస్సు ప్రమాదం..20 మందికి గాయాలు

తిరువనంతపురం ముచ్చట్లు:

కేరళలో ఆదివారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వడకర ప్రాంతంలో కేరళకి చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *