కేరళ ‘హత్యలు’ కరెక్టే : కమల్

దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందని సంచలన ఆరోపణలు చేశారు నటుడు కమల్ హాసన్. హిందూ ఉగ్రవాద దాడులను అరికట్టడంలో కేంద్రం విఫలమైందన్నారు. సత్యమేవ జయతేని ప్రజలు నమ్మడం లేదన్నారు. తమిళనాడులో హిందూ సంస్థల దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తంచేసిన ఆయన, కేరళ ప్రభుత్వం వీటిని అదుపు చేయడంలో సక్సెస్ అయ్యిందన్నారు.ఈ దాడులను అరికట్డంలో యూపీ, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలతో పాటు తమిళనాడు కూడా విఫలమైందని అన్నారు. తమిళనాడులోని ఓ వీక్లీ మేగజైన్‌కి రాసిన కాలమ్‌లో ఈ వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రస్తావించారు.కేరళలో ఇప్పటికే వివాదాస్పదంగా మారిన ‘ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యల’ను కమల్ పరోక్షంగా సమర్థించినట్లైంది. అక్కడి కమ్యూనిస్టుల ఆగడాలపై దేశవ్యాప్త ఉద్యమాన్ని కూడా మొదలుపెట్టిన బీజేపీ హైకమాండ్, కమల్ వ్యాఖ్యల్ని ఎలా తీసుకుంటుందన్నది ఆసక్తికరం. కమల్ వ్యాఖ్యలను బీజేపీయేతర పార్టీలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. ఒకవిధంగా మోదీ ప్రభుత్వానికి మంటపెట్టినట్టేనా?అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *