Kalvakuntla-Chandrasekhar-Rao-Telangana-today

కేసీఆర్‌కు అన్నీ కలిసొస్తున్నాయంతే…

వరంగల్‌ లోక్‌సభ ఉపఎన్నిక ముగిసినప్పటికీ దాని ప్రతిధ్వనులు ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. రాజకీయ ఆకర్షణే బలంగా సాగిన, సాగుతున్న తెలుగు రాష్ట్రాల్ల్రో ప్రత్యేకించి తెలంగాణలో పాలకపక్షాన్ని ఎదుర్కోగలిగిన చరిష్మా ఏ పార్టీలోనూ లేకపోవడమే కేసీఆర్‌ని తెలంగాణ రాజకీయాల్లో శిఖరస్థారులో నిలిపింది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ నేతలు పూర్తిగా జావగారిపోవడం తెరాసకు ఆయాచిత వరంలాగా లాభించింది. ఎన్టీఆర్‌ నుంచి మొదలుకుని చూస్తే సమైక్యాంద్రప్రదేశ్‌లో జనాకర్షణ కలిగిన నేతల హవానే నడిచింది. ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు, తర్వాత రాజశేఖరరెడ్డి కేవలం తమ ప్రజాకర్షక శక్తియుక్తుల తోటే రాజకీయాల్లో మనగలిగారు. వీరు తమ సొంత బలంమీదే, ఆకర్షణ శక్తితోటే ప్రజల హృదయాలను గెల్చుకోగలిగారు. సరిగ్గా అదే విధంగా కేవలం కేసీఆర్‌ చరిష్మాతోనే తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మరికొంత కాలం ఇదే పునాదిమీదే నడుస్తాయని సంకేతాలు సూచిస్తున్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలకు ఇదే పెద్ద అవరోధంగా మారుతోంది. కేసీఆర్‌ను పోలిన జనాకర్షక వ్యక్తి తెలంగాణ ప్రతిపక్షాల్లో ఏ పార్టీలోనూ లేకపోవడమే వాటి బలహీనత కాగా, సరిగ్గా ఈ బలహీనతే కేసీఆర్‌ బలమై కూర్చుంది. తెలంగాణలో ఈవిధంగా జనాలను ఆకర్షించగలనని తెలుగుదేశం నేత రేవంత్‌ రెడ్డి ప్రారంభంలో హామీ ఇచ్చాడు గానీ ఓటుకు నోటు కేసుతో జావగారిపోయాడు. ఇప్పుడు ఈ కేసు తార్కిక ముగింపుకు చేరుకోలేదని స్పష్టమవుతోంది. రేవంత రెడ్డి తన మచ్చను తొలగించుకుని మళ్లీ ప్రజల్లో స్తానం సంపాదించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. నాయకత్వ సంక్షోభం పాలక పార్టీకి విజృంభించేందుకు మంచి అవకాశమైంది.

ప్రతిపక్ష పార్టీలలో ఏదీ ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనిపించకపోవడం కూడా తెరాస బలాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. దేశ చరిత్రలో మొదటిసారిగా రిజర్వ్‌ బ్యాంకుకు చుక్కలు చూపించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. మామూలు చుక్కలు కాదు.. గతంలో తనతో ఆడుకున్న పాపానికి ఇప్పుడు దేశ కేంద్ర బ్యాంకునే తెలంగాణ ప్రభుత్వం ఫల్టీ కొట్టించింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి పన్ను నోటీసులు అందుకున్న రిజర్వ్‌ బ్యాంకు అధికారులు ఏం చేయాలో పాలుపోక బిత్తరపోయారంటే కేసీఆర్‌ ప్రతీకారం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. విషయంలోకి వస్తే హైదరాబాద్‌లో లకడీకాపూల్‌, చెంగిచెర్ల రెండు ప్రాంతాల్లో భారతీయ రిజర్వ్‌ బ్యాంకు రెండు టంకశాలలను నిర్వహిస్తోంది. ఇక్కడ నాణాలను ముద్రిస్తుంటారు. ఇవి రెండూ వ్యాపార సంస్థలు కాబట్టి సంవత్సరానికి వ్యాట్‌ కింద 25 కోట్ల రూపాయలను ఆర్బీఐ చెల్లించాలని, ఇంతవరకు అది చెల్లించకుండా ఉన్న 200 కోట్ల మొత్తాన్ని కూడా చెల్లించాలని తెలంగాణ ప్రభుథ్వం రిజర్వ్‌ బ్యాంకుకు పన్ను చెల్లింపు నోటీసులను అందజేసింది. తెలంగాణ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి తనకు రావలసిన ఆదాయ పన్ను బకారులకు గాను కొన్ని నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వ ఖాతా నుంచి ఆర్బీఐ రూ. 1200 కోట్లను తీసేసుకుంది. ఆ మొత్తాన్ని తిరిగి తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పడరాని పాట్లు పడింది.

ఇక్కడ గమనించవలిసింది ఏమిటంటే హైదరాబాద్‌ లోని తన నాణేల ముద్రణ శాలలకు వ్యాట్‌ను మినహారుంచాలని ఆర్బీఏ గతంలోనే దరఖాస్తు చేసుకుంది. సమైక్యరాష్ట్లంలో నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్పీఐ ఈ వ్యాట్‌ మినహారుంపు పత్రాన్ని దాఖలు చేసుకుంది. ఇన్నాళ్లుగా దాని అతీగతి ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వం దాన్ని తవ్వి తీసి దుమ్ము దులిపి భారతీయ రిజర్వ్‌ బ్యాకుకు సవాలు విసిరింది. కేసీఆర్‌ తన ప్రత్యర్థులను అంత తేలికగా వదలరన్నది జగమెరిగిన సత్యం. రాజకీయ పక్షాలంటే సరేసరి. చివరకు కేంద్ర బ్యాంకును కూడా వదలని కేసీఆర్‌ని చూసి జనం ఔరా అంటున్నారు. ఇక, వరంగల్‌ ఉప ఎన్నిక ఫలితం టీఆర్‌ఎస్‌ను విజయానందంతో ముంచేసింది. ఊహించినదాని కన్నా బంపర్‌ మెజారిటీతో వరంగల్లో గులాబీ పార్టీ సత్తా చాటింది.

గతంలో మెజారిటీని అధిగమించేసింది. దేశంలోనే అతి భారీ మెజారిటీల్లో 7 స్థానం దక్కించుకుంది. తెలంగాణ చరిత్రలో అత్యధిక రికార్డుగా నమోదర్యుంది. గులాబీ చేతిలో ఇంతగా పరాజయం పొందినా కాంగ్రెస్‌ పార్టీ ఇంకా దీమాగానే ఉంది. వరంగల్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచినా అసలు గెలుపు తమదే అంటోంది. ఇలాంటి పరాజయాల్లో నైతిక విజయం మాదే అని ఓడిపోరున పార్టీ చెప్పడం అలవాటే. కానీ కాంగ్రెస్‌ ఈసారి అలా అడ్డగోలుగా చెప్పడం లేదు. అందుకు ఓ బ్రహ్మాండమైన లాజిక్‌ చెప్పింది. వరంగల్‌ ఉపఎన్నికలో జనం కాంగ్రెస్‌ పార్టీ వైపు ఎలా ఉన్నారో ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోరున సర్వే సత్యనారాయణ గారు సెలవిచ్చారు. వరంగల్‌ ఉపఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలుపు తనదేనని ఢంకా భజారుస్తున్నారు. ఆయన విశ్లేషణ చూసి ప్రెస్‌ మీటుకొచ్చిన విలేకర్లంతా తెల్లబోయారు. అబ్బా.. ఇలాంటి విశ్లేషణ ఇంతవరకూ ఎవరూ చెప్పలేదబ్బా అని బుర్రలు పట్టుకున్నారు.

ఇంతకీ అందర్నీ అంతగా ఆలోచనలో పడేసిన అనాలసిస్‌ ఏంటో తెలుసా ఏ ఎన్నికల లెక్కింపైనా ప్రారంభంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కేస్తారు. ఈసారి వరంగల్‌ ఉపఎన్నికల్లో నాలుగంటే నాలుగే పోస్టల్‌ ఓట్లు పోలయ్యారు. ఆ నాలుగు ఓట్లూ కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయణే వచ్చారు. అంటే నూటికి నూరు శాతం అన్నమాట. ఆ తర్వాత ఈవీఎం ఓట్లలో నాలుగు లక్షల పైచిలుకు మెజారిటీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి వచ్చింది. సో బ్యాలెట్‌ విజయం సర్వే సత్యనారాయణదైతే ఈవీఎం విజయం టీఆర్‌ఎస్‌ దన్న మాట. ఈవీఎంలను ట్యాంపర్‌ చేశారు కాబట్టే గులాబీ పార్టీ గెలిచిందని బ్యాలెట్‌ను ట్యాంపర్‌ చేయలేరు కాబట్టే అవి నూటికి నూరు శాతం తనకే వచ్చాయని సర్వే చెప్పుకొచ్చారు. కిందపడినా పైచేరు తనదే అనడం అంటే ఇదే మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *