కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే కేక్ కట్‌చేయించారు.

ముంబై ముచ్చట్లు

పోలీసులంటే… వాళ్లకు అసలు మానవత్వం ఉండదు. చాలా  రఫ్‌గాఉంటారు. స్టేషన్‌కు వెళ్తే సరిగ్గా రెస్పాన్స్ కూడా ఇవ్వరు. ఇది.. పోలీసులపై జనాల్లో ఉన్న అభిప్రాయం. కాని.. ఆ అభిప్రాయాన్ని తప్పని నిరూపించారు ముంబై పోలీసులు. ముంబైకి చెందిన ఓ యువకుడు కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నప్పుడు అతడు త‌న డిటెయిల్స్ పోలీసుల‌కు చెబుతుండగా.. ఆయన డేట్ ఆఫ్ బర్త్ అదే రోజ‌ని తెలిసింది. దీంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీసులు సడెన్‌గా కేక్ తీసుకొచ్చి ఆ యువకుడి బర్త్ డేను సెలబ్రేట్ చేశారు. దీంతో షాక్ తిన్న ఆ యువకుడు పోలీసులంటే పీక్కుతింటారని విన్నా కాని.. ఇంత మంచి పోలీసులుంటారని ఇప్పుడే చూస్తున్నానంటూ..పోలీస్ స్టేష‌న్‌లో త‌న బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేయ‌డం ఎంతో సంతోషంగా ఉందంటూ చెప్పాడు. ఇక.. ఈ విషయాన్ని ముంబై పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో నెటిజన్లు ముంబై పోలీసులపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *