కొడంగల్‌లో తన అనుచరులతో రేవంత్ సమావేశం

కొడంగల్ ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి ఆదివారం తన నియోజకవర్గమైన కొడంగల్‌లో తన అనుచరులతో సమావేశం అయ్యారు. తన భవిష్యత్ కార్యాచరణపై వారితో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న టీఆర్ఎస్‌పై అందరూ కలిసి పోరాడితేనే ఫలితం ఉంటుందని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని తెలంగాణ సమాజం, బుద్దజీవులు తనకు విజ్ఞప్తి చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే టీఆర్ఎస్‌కు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో తాను చేరాలని నిర్ణయించుకున్నట్లు రేవంత్ రెడ్డి తన అనుచరులకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *