‘కొలువుల కొట్లాట’ సభ జరిపి తీరుతాం: కోదండరామ్

హైదరాబాద్ ముచ్చట్లు:

ఈనెల 31వతేదీన కొలువుల కొట్లాట సభ జరిపి తీరుతామని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరామ్ పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ… సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. అలాగే పోలీసులు సభ జరగనీయవద్దనే ఆలోచనలో ఉన్నారని కోదండరాం అన్నారు. సభకు స్థలాలు, ఫంక్షన్‌హాళ్లు ఇవ్వొద్దని యజమానులను బెదిరిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో సభలు పెడితే ఏం కారణాలు చెప్పారో.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదే కారణాలు చెబుతోందన్నారు. ఆంధ్రా పాలకుల కంటే దుర్మార్గంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కోదండరాం పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *