గాంధీభవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

హైదరాబాద్ ముచ్చట్లు

కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. శుక్రవారం చలో అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ పిలునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే… ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తెలుపుతున్నారు. కాగా… గాంధీభవన్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీగా రావాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించడంతో ఆయా జిల్లాల నుంచి కార్యకర్తలు గాంధీభవన్‌కు చేరుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకుంటున్నారు. అంతేగాక నగర శివార్లలో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నల్గొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి అనుచరులు శుక్రవారం అసెంబ్లీ వద్దకు రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌ను రాచకొండ పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *