Guntur was the first female president of the court

గుంటూరు జడ్పీ తొలి మహిళా అధ్యక్షురాలు… దొడ్డపనేని

Date: 06/01/2018

గుంటూరు ముచ్చట్లు:

డి. ఇందిరగా ప్రసిద్ధిచెందిన దొడ్డపనేని ఇందిర… రాష్ట్రానికి సంబంధించినంత వరకూ ప్రముఖ రాజకీయవేత్త. ఈమె మాజీ మంత్రి ఆలపాటి వెంకటరామయ్య, సామ్రాజ్యమ్మల కుమార్తె. ఈమె జనవరి 7వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో యడ్లపల్లి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత చెన్నైలో బి.ఎస్‌.సి. (హోం సైన్స్‌)లో డిగ్రీ తీసుకున్నారు. 1955 జనవరి 7వ తేదీన ప్రముఖ ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ దొడ్డపనేని లక్ష్మీనారాయణ ప్రసాద్‌ని వివాహమాడారు. తండ్రి మరణంతో ఏర్పడిన లోటును భర్తీ చేయడానికి కామరాజ్‌ నాడార్‌, నీలం సంజీవరెడ్డి ప్రోత్సాహంతో ఈమె రాజకీయ ప్రవేశం చేశారు. ఈమె తెనాలి శాసనసభ నియోజకవర్గం నుండి మూడు సార్లు (1967, 1972, 1978) ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికయ్యారు. ఇందులో మొదటిసారి కాంగ్రెసు పార్టీ అభ్యర్ధిగా, రెండవసారి ఇండిపెండెంటుగా, మూడవసారి జనతా పార్టీ అభ్యర్ధిగా పోటీచేసి నెగ్గడం విశేషం. నాలుగవసారి అన్నాబత్తుని సత్యనారాయణపై పోటీచేసి ఓడిపోయారు. పదవి లేకపోయినా అందరికీ అందుబాటులో వుండి, కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజా సమస్యల సాధనకై పనిచేశారు. 1987లో జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికలలో గుంటూరు జిల్లా పరిషత్‌కు తొలి మహిళా అధ్యక్షురాలిగా అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈమె సెప్టెంబర్‌ 16వ తేదీన పరమపదించారు. వీరి కుమార్తె గోగినేని ఉమ తిరిగి తెనాలి శాసనసభ నియోజకవర్గం నుండి 2004 సంవత్సరంలో ఎన్నిక కావడం విశేషం.

Tags: Guntur was the first female president of the court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *