గుజరాత్‌ క్రిమినల్‌ కోడ్‌కు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

పశ్చిమ బెంగాల్‌ ఇండస్ట్రియల్‌ అమెండమెంట్‌, గుజరాత్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సహా 9 కీలక బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమెద ముద్ర వేశారు. రాష్ట్రపతి భవన్‌ వర్గాలు మీడియాతో మాట్లాడుతూ.. 8 రాష్ట్రాలకు చెం‍దిన 9 కీలక బిల్లును రాష్ట్రపతి ఆమోదించినట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా 2017 (గుజరాత్‌ రాష్ట్ర చట్టసవరణ) క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ఉండడం గమనార్హం. ఈ చట్టం ద్వారా నిర్భంద ఖైదీలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టుతో మాట్లాడేందుకు అవకాశం కల్పిచడం జరుగుతుందని గుజరాత్‌ అధికారులు తెలిపారు. ఈ చట్ట సవరణ వల్ల కీలక కేసుల్లో శిక్ష పడిన ఖైదీల రక్షణ కల్పించడంతో పాటు, వారిని కోర్టుల చుట్టూ తిప్పే ఇబ్బందులు పోలీసులకు ఉండవని గుజరాత్‌ అధికారులు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *