గోదావరిలో దూకి కుటుంబం ఆత్మహత్యాయత్నం…

ప.గో: గోదావరిలో దూకి ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఈమేరకు ఇవాళ మధ్యాహ్నం సిద్ధాంతం బ్రిడ్జి వద్ద ఇద్దరు పిల్లలతో సహా దంపతులు నదిలోకి దూకారు. అప్పుల బాధలతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్ధానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెరవల్లి మండలం కానూరుకు చెందిన నాగరాజు (37), వరలక్ష్మి (28), చంద్రిక (8), బాలమాణిక్యం (9) గా గుర్తించారు. గల్లెంతైన వారికోసం స్ధానికులు , పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *