గ్యాస్ ధరలను తగ్గించాలి. – ఎఐడిఆర్ఎఫ్ నాయకుల డిమాండ్.

పలమనేరు ముచ్చట్లు

పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఎఐడిఆర్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త సుధాకర్, ఉప కార్యదర్శి చిన్న ఒక ప్రకటనలో సంయుక్తంగా డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలను పొగరహిత గ్రామాలుగా మార్చి,మహిళలకు ఆరోగ్య భద్రత చేకూర్చే దిశగా గ్యాస్ ధరలను అమాంతం పెంచడం సమంజసం కాదని తెలిపారు. సిలిండర్ లేనివారికి రేషన్ కార్డు రద్దు చేస్తామనే నెపంతో బలవంతంగా సిలిండర్లను కట్టబెట్టి దళితులను ఈ ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను తగ్గించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఎఐడిఆర్ఎఫ్ నాయకులు సుధ చిన్న తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *