చంద్రబాబుతో రేవంత్ ఏకాంత చర్చలు!

 

అమరావతి ముచ్చట్లు

విదేశి పర్యటన నుంచి వచ్చిన సీఎం చంద్రబాబు టీటీడీపీ వివాదంపై దృష్టిపెట్టారు. శుక్రవారం లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీకి హాజరై.. రేవంత్‌రెడ్డి కొద్దిసేపు ఆలస్యంగా వచ్చారు. ఒక్కొక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు నిర్ణయించారు. దాంతో అందరూ అమరావతికి రావాలని ఆదేశించారు. తొందరపడి ఎవరూ ఏం మాట్లాడవద్దని హెచ్చరికలు జారీ చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఆర్. కృష్ణయ్య, సీతక్క, ఉమా మాధవరెడ్డితో సహా కీలక నేతలంతా ఈ సమావేశానికి హాజరైనారు. రేవంత్, చంద్రబాబుతో కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.తెలంగాణలోని పరిస్థితులను రేవంత్, బాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.అయితే కాంగ్రెస్ చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై రేవంత్ ఏమీ మాట్లాడలేదని వినికిడి. శనివారం అమరావతిలో మాట్లాడుదామని రేవంత్‌కు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. సమావేశంలో కొంతమంది సీనియర్లు రేవంత్ చేస్తున్న ఆరోపణలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రేవంత్ కాంగ్రెస్‌తో వ్యవహరిస్తున్న తీరు… టీడీపీ, బీజేపీ మీటింగ్‌ను సీఎం కేసీఆర్ పెట్టించారని రేవంత్ చేసిన ఆరోపణలను రమణ, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ”మనకు కాంగ్రెస్ ఎంత దూరమో… టీఆర్‌ఎస్ అంతే కాదా” అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *